తెలంగాణలో మరో 44 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 12,829 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 31 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న వారు 34 మంది
- ఇంకా 364 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 7,92,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,716 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ స్వల్ప పెరుగుదల నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 364 మంది చికిత్స పొందుతున్నారు.
