హెలికాప్టర్ ఎక్కిస్తా... విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన చత్తీస్ గఢ్ సీఎం
- 10, 12వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహకం
- 10 మంది టాపర్లకు హెలికాప్టర్ ప్రయాణం చాన్స్
- వారిని రాయ్ పూర్ ఆహ్వానిస్తానన్న బఘేల్
పిల్లలకు ఈ హెలికాప్టర్ ప్రయాణం ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని, జీవితంలోనూ ఉన్నతమైన ఎత్తులకు ఎదగాలన్న వారి ఆశయానికి ప్రేరణ కలిగిస్తుందని సీఎం భూపేశ్ అభిప్రాయపడ్డారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత టాప్-10 విద్యార్థులను హెలికాప్టర్ ప్రయాణం కోసం రాయ్ పూర్ ఆహ్వానిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు సాగిస్తున్న సీఎం బఘేల్ బలరాంపూర్ జిల్లా రాజ్ పూర్ లో ఈ మేరకు మీడియా సాక్షిగా ప్రకటన చేశారు.