Rape: ఏపీలో మరో దారుణం.. రేపల్లే రైల్వే స్టేషన్ లో భర్తను కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం

3 Men Raped Woman In Repalle
  • నిన్న అర్ధరాత్రి ఘటన
  • పనుల కోసం అవనిగడ్డకు ప్రయాణం
  • రేపల్లే రైల్వే స్టేషన్ లో దిగిన దంపతులు
  • బల్లపై పడుకున్న మహిళను లాక్కెళ్లిన దుండగులు
  • అడ్డొచ్చిన భర్తపై దాడి.. రంగంలోకి దిగిన ఎస్పీ
ఏపీలో మరో దారుణం జరిగింది. బాపట్ల జిల్లాలోని రేపల్లే రైల్వే స్టేషన్ లో కొందరు దుండగులు ఓ వ్యక్తిని చితకబాది.. అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన దంపతులు.. అవనిగడ్డలో పనుల కోసం వచ్చారు. రేపల్లే రైల్వే స్టేషన్ లో దిగారు. అర్ధరాత్రి కావడం.. రవాణా సదుపాయం లేకపోవడంతో స్టేషన్ లోని బల్లలపైనే పడుకున్నారు. 

ముగ్గురు వ్యక్తులు ఆ మహిళను పక్కకు లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అడ్డుపడిన భర్తను చితకబాదారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబాన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  

ఘటనపై బాపట్ల ఎస్పీ వకూల్ జిందాల్ స్వయంగా రంగంలోకి దిగారు. రేపల్లే పోలీస్ స్టేషన్ కు చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనకు పాల్పడిన ముగ్గురు స్థానికులేనని సమాచారం. ఆ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Rape
Crime News
Andhra Pradesh
Repalle
Bapatla

More Telugu News