కిషన్ రెడ్డి తెలంగాణలో తిరగలేడు: బాల్క సుమన్
- బండి సంజయ్ ది పాపాలు కడుక్కునే యాత్ర
- మోదీ అసమర్థత వల్ల దేశంలో కరెంట్ కోతలు ఏర్పడ్డాయి
- తెలంగాణ ద్రోహులకు జగ్గారెడ్డి కొమ్ముకాశారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై బాల్క సుమన్ స్పందిస్తూ... తనను విమర్శించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జగ్గారెడ్డి లేరని అన్నారు. తెలంగాణ ద్రోహులకు ఆయన కొమ్ము కాశారని మండిపడ్డారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని చెప్పారు.