కాబూల్ మసీదులో శక్తిమంతమైన పేలుడు.. 66 మంది మృతి
- సున్నీ ముస్లింలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
- రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా మసీదుకు పోటెత్తిన భక్తులు
- పేలుడు ధాటికి కూలిన మసీదు పైకప్పు
- తీవ్రంగా గాయపడిన మరో 78 మంది
పేలుడుకు ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. ఈ పేలుడుపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్టు కాబూల్ పోలీస్ చీఫ్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ పేర్కొన్నారు. కాగా, పేలుడు కారణంగా మసీదు పైకప్పు కూలిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఐక్యరాజ్య సమితి అభద్రత మధ్య నిత్యం హింసకు గురవుతున్న ఆఫ్ఘన్ ప్రజలకు ఇది మరో బాధాకరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేసింది.