Nara Lokesh: అట్టుంటది ఒక్క ఛాన్స్‌ తోని!.. అంటూ కేటీఆర్ వీడియోను పోస్ట్ చేసిన నారా లోకేశ్

nara lokesh satirical tweet on ktr comments
షార్ట్స్‌లో చూడండి
పొరుగు రాష్ట్రంలో మౌలిక వ‌స‌తులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మాట‌ల మంట‌ల‌ను రాజేశాయి. కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు కౌంట‌ర్లు ఇస్తుంటే... వాటికి రీ కౌంట‌ర్లు ఇస్తూ టీఆర్ఎస్ నేత‌లు సాగుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఏపీలోని వాస్త‌వ ప‌రిస్థితుల‌కు కేటీఆర్ వ్యాఖ్య‌లు అద్దం ప‌డుతున్నాయంటూ ఏపీలో విప‌క్ష పార్టీ టీడీపీ కీల‌క వ్యాఖ్య‌లు చేస్తోంది.

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్... కేటీఆర్ వ్యాఖ్య‌ల వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి అట్టుంటది ఒక్క ఛాన్స్‌ తోని! అంటూ ఓ సెటైరిక్ కామెంట్‌ను యాడ్ చేశారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చి రాష్ట్రాన్ని అధోఃగ‌తి పాలు చేశార‌న్న అర్థం వ‌చ్చేలా లోకేశ్ ఈ సెటైర్‌ను సంధించారు.
Go Back to Shorts
Nara Lokesh
TDP
KTR

More Telugu News