పుష్ప, కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్ విజయాలు బాలీవుడ్‌ను భయపెడుతున్నాయి: సినీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్
- బాలీవుడ్‌కి చెందిన వారికి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదన్న మనోజ్
- బాలీవుడ్‌కు దక్షిణాది సినీ పరిశ్రమ గుణపాఠం నేర్పిందని వ్యాఖ్య
- ఎంతో కొంత నేర్చుకోవాలని హితవు
బాలీవుడ్ ఈ పరిస్థితుల నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలని అన్నాడు. దక్షిణాది వారు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌తో పని చేస్తారని, ప్రతి సీన్ ప్రపంచంలోనే బెస్ట్ సీన్‌గా ఉండాలని కోరుకుంటారని చెప్పాడు. పుష్ప, కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలు చూస్తే ఆ సినిమాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా తీసినట్లు కనిపిస్తాయని చెప్పాడు. అటువంటి నిబద్ధత బాలీవుడ్‌కి లేదని అన్నాడు. బాలీవుడ్‌లో బాక్సాఫీస్ కలెక్షన్ల గురించే ఆలోచిస్తారని చెప్పాడు. ఇకపై నుంచయినా సినిమా తీయడంలో బాలీవుడ్ మెళకువలు నేర్చుకోవాలని ఆయన అన్నాడు.