టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూత

TDP leader Satrucharla Chandra Sekhar Raju passed away
  • గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శత్రుచర్ల
  • ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన సీనియర్ నేత
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన నారా లోకేశ్
టీడీపీ సీనియర్ నేత శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 1989 నుంచి 1994 వరకు బాధ్యతలను నిర్వర్తించారు. 

వైసీపీ ఆవిర్భవించిన తర్వాత శత్రుచర్ల ఆ పార్టీలో చేరి, కీలక నేతగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత... వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు చంద్రశేఖర్ రాజు సోదరుడు అవుతారు. అంతేకాదు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి స్వయానా మామయ్య అవుతారు. 

శత్రుచర్ల మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. శత్రుచర్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
Satrucharla Chandra Sekhar Raju
Telugudesam
Dead
Nara Lokesh

More Telugu News