తెలంగాణలో మరో 31 మందికి కరోనా

Telangana Corona update
  • గత 24 గంటల్లో 14,939 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 21 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 19 మంది
  • ఇంకా 211 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 14,939 కరోనా పరీక్షలు నిర్వహించగా, 31 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 19 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,772 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,450 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 211 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Today Cases

More Telugu News