చంద్రన్నా, పెద్దన్నా.. ఆకట్టుకుంటున్న చంద్రబాబు బర్త్ డే సాంగ్ ప్రోమో
- చంద్రబాబు బర్త్ డే సందర్భంగా ప్రత్యేక గీతాన్ని రూపొందించిన అభిమానులు
- వీడియో ప్రోమోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పార్టీ
- జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రోమో
అధినేత పుట్టిన రోజంటే పార్టీ శ్రేణులకు పండుగే కదా అంటూ పేర్కొన్న టీడీపీ.. తమ అధినేత గురించి ఎంతో గర్వంగా చెప్పుకునే పార్టీ కార్యకర్తలకు మరింత మహదానందకరమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రూపొందించిన వీడియో సాంగ్ ప్రోమో చూడండి.. అంటూ టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ప్రోమోను పోస్ట్ చేసింది.