తెలంగాణలో తాజాగా 22 కరోనా కేసులు

Telangana daily corona report
  • గత 24 గంటల్లో 14,339 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 12 మందికి పాజిటివ్
  • కరోనా నుంచి కోలుకున్న 24 మంది
  • ఇంకా 187 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 14,339 కరోనా పరీక్షలు నిర్వహించగా, 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 12 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,672 మంది కరోనా బారినపడగా, వారిలో 7,87,374 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 187 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మరణించారు.
.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
Updates
Today Cases

More Telugu News