Andhra Pradesh: ఏపీలో మే 9 నుంచి స‌మ్మ‌ర్ హాలిడేస్‌.. జులై 4న స్కూళ్ల రీఓపెన్‌

summer holidays for ap students from 9th of next month
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం జులై 4 నుంచి మొద‌లు కానుంది. ఈ మేర‌కు శ‌నివారం ఏపీ విద్యా శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రాష్ట్రంలోని విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు మొద‌లు కానున్నాయి. 

కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్ష‌లు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి.

ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రీక్ష‌లు పూర్తి కాగానే వారికి వేస‌వి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. ఏపీలోని జూనియర్‌ కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 20 వరకు సమ్మర్‌ హాలిడేస్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణ‌యించింది.
Go Back to Shorts
Andhra Pradesh
Summer Holidays
Schools

More Telugu News