'ఆచార్య ' రికార్డుల వేట మొదలైనట్టే!
- దూసుకుపోతున్న 'ఆచార్య' ట్రైలర్
- రికార్డుస్థాయిలో నమోదవుతున్న లైక్స్
- ఈ నెల 24వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 29వ తేదీన సినిమా విడుదల
ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇటు చిరంజీవి - అటు చరణ్ యాక్షన్ కి ప్రాధాన్యతనిస్తూ కట్ చేసిన ట్రైలర్ ఒక రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. చాలా తక్కువ సమయంలో ఈ ట్రైలర్ రాకెట్ లా దూకుపోయింది. అత్యధిక వ్యూస్ తో పాటు లైక్స్ ను కూడా రికార్డు స్థాయిలో రాబట్టుకుంది. చాలా ఫాస్టుగా 1 మిలియన్ ప్లస్ లైక్స్ ను దక్కించుకోవడం విశేషంగా చెబుతున్నారు.
ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. త్వరలో మరో సింగిల్ ను వదలాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సోనూ సూద్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, పోసాని .. సంగీత .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. రెజీనా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి, 29వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.