ఢిల్లీలో మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన యువతి.. ప్రాణాలు కాపాడిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. వీడియో ఇదిగో
- అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ వద్ద ఘటన
- సీఐఎస్ఎఫ్ సిబ్బంది నచ్చజెప్పినా వినిపించుకోని యువతి
- కింద దుప్పటితో ఆమెను పట్టుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది
- స్వల్ప గాయాలతో బయటపడిన యువతి
మరోవైపు, కిందనున్న కొందరు సిబ్బంది ఓ దుప్పటిని గట్టిగా పట్టుకుని యువతి అందులో పడేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఆమె పడిన వేగానికి నేలకు బలంగా తాకడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 22 ఏళ్ల వయసున్న ఆమెను పంజాబ్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన సీఐఎస్ఎఫ్.. వేగంగా, తెలివిగా స్పందించి యువతి ప్రాణాలు కాపాడినట్టు పేర్కొంది.