Assam: అసోంలో విషాదం... పుట్ట‌గొడుగులు తిని 13 మంది మృత్యువాత‌

13 people died in Assam after consuming mushroom in assam
షార్ట్స్‌లో చూడండి
ఈశాన్య రాష్ట్రం అసోంలో బుధ‌వారం విషాదం చోటుచేసుకుంది. పుట్ట‌గొడుగులు తిన్న 13 మంది మృత్యువాత ప‌డ్డారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. మ‌రో 39 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో మృత్యువాత ప‌డ్డ వారంతా తేయాకు కార్మికులుగా అధికారులు గుర్తించారు. అసోంలోని దిబ్రూగ‌ఢ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌నలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని అధికారులు హుటాహుటీన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వీరిలోని కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.
Go Back to Shorts
Assam
mushroom
Dibrugarh

More Telugu News