ఐపీఎల్: కొత్త జట్టుకు తొలి ఓటమి రుచిచూపిన సన్ రైజర్స్
- మరో విజయం నమోదు చేసుకున్న సన్ రైజర్స్
- గుజరాత్ పై 8 వికెట్లతో ఘనవిజయం
- అర్ధసెంచరీతో రాణించిన విలియమ్సన్
- సూపర్ ఫినిషింగ్ ఇచ్చిన పూరన్
తొలుత ఓపెనర్లు అభిషేక్ శర్మ (42), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57) సరైన పునాది వేయగా, చివర్లో నికోలాస్ పూరన్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 నాటౌట్) అద్భుతమైన ముగింపునిచ్చాడు.
ఈ ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ ఎంతో ఓపికగా ఆడి, అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శిస్తూ ఎక్కడా రన్ రేట్ తగ్గకుండా చూశాడు. విలియమ్సన్ స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఈ న్యూజిలాండ్ ఆటగాడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.