ఏపీలో అమల్లోకి పవర్ హాలిడే.. పరిశ్రమలు రెండు వారాలు బంద్
- 8 నుంచి 22 వరకు పవర్ హాలిడే
- ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌నే వినియోగించాలి
- 1,696 పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే
- వారాంతపు సెలవుకు పవర్ హాలిడే అదనం
- ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పరిశ్రమలకు వర్తింపు
ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల ప్రకారం.. 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌నే వాడాల్సి ఉంటుంది. 1,696 పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేయాలి. వారాంతపు సెలవుకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడేను కొనసాగించాలి. ఈ నెల 8 నుంచి 22 వరకు రెండు వారాల పాటు అన్ని పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.