Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్' 10 రోజుల వసూళ్లు ఇవే!

RRR movie update
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' మార్చి 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తూ వెళుతోంది. తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి కొత్త రికార్డులను కొల్లగొట్టేసింది.

10 రోజుల్లో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 97 కోట్ల షేర్ ను వసూలు  చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 232.19 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 494.20 కోట్ల షేర్ ను వసూలు చేసింది. గ్రాస్  పరంగా చూసుకుంటే  750 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేయడం విశేషం. 

చాలా వేగంగా .. అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ సినిమాగా 'ఆర్ ఆర్ ఆర్' ప్రశంసలు అందుకుంటోంది. కథాకథనాలు .. చిత్రీకరణ .. పాటలు .. భారీ సెట్స్ .. కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. వసూళ్ల పరంగా ఈ సినిమా ఇంకా అదే దూకుడును కొనసాగిస్తూ ఉండటంతో, అందరూ 1000 కోట్ల మార్క్ పై దృష్టి పెట్టారు.
Go Back to Shorts
Junior NTR
Ramcharan
Rajamouli
RRR

More Telugu News