ఈ ఐపీఎల్‌లో భారీ సిక్సర్ నమోదు చేసిన లివింగ్‌స్టోన్.. వీడియో వైరల్
- 108 మీటర్ల భారీ సిక్స్ బాదిన లియామ్
- సొంత రికార్డే బద్దలు
- లియామ్ దెబ్బకు ఒక్క ఓవర్‌లో 26 పరుగులు సమర్పించుకున్న ముకేశ్
ఎడమకాలిని ముందుకు వేసి మిడ్ వికెట్ మీదుగా బాదితే బంతి వెళ్లి 108 మీటర్ల దూరంలో పడింది. ఇది ఈ సీజన్‌లోనే అతి భారీ సిక్సర్‌గా నమోదైంది. ఈ సిక్స్‌తో లియామ్ తన సొంత రికార్డునే బద్దలు గొట్టాడు. గతంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్‌లో ఓ బంతిని 105 మీటర్లు పంపాడు. ఇప్పుడు అంతకుమించి బాది సొంత రికార్డును చెరిపేశాడు. లివింగ్ స్టోన్ తర్వాతి స్థానాల్లో జోస్ బట్లర్ (101 మీటర్లు), ఇషాన్ కిషన్ (98 మీటర్లు) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో లియామ్.. 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు సాధించాడు.