డ్రగ్స్ కేసుతో నాకేం సంబంధం లేదు.. ప్రముఖులను వదిలేసి నాపై నిందలా?: సినీ నటి హేమ
- కావాలనే నన్ను బదనాం చేస్తున్నారు
- దాడి చేసిన పబ్ కు తాను వెళ్లనేలేదని క్లారిటీ
- బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
రాహుల్ సిప్లిగంజ్, సినీ నటి నిహారిక సహా పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మళ్లీ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పబ్ కు తాను వెళ్లనేలేదని, కానీ, కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై అభాండాలు వేస్తూ పేరును ప్రసారం చేస్తున్నాయని హేమ ఆరోపించారు. ప్రముఖులను వదిలేసి తనపై నిందలు మోపడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇవాళ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.