Nara Lokesh: సీఎం జగన్ ఏప్రిల్ ఫూల్ చేశారు: నారా లోకేశ్

lokesh slams ycp
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెరిగిపోతోన్న విద్యుత్ ధ‌ర‌ల‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ధ‌ర‌లు అన్నింటినీ త‌గ్గిస్తాన‌ని ఎన్నికల ముందు చెప్పిన జ‌గ‌న్ ఇప్పుడు పెంచుకుంటూ పోతున్నార‌ని ఆయ‌న అన్నారు. 

ఎన్నికల హామీల విషయంలో రాష్ట్ర ప్రజల్ని జగన్ ఏప్రిల్ ఫూల్ చేశారని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జనం చెవిలో జగన్ పూలు పెట్టారని, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, మద్య నిషేధం హామీ, ప్రత్యేక హోదా సాధన, సన్న బియ్యం పంపిణీ హామీలన్నీ అమలు చేయకుండా ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని లోకేశ్ అన్నారు. 

కాగా, ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఆ ఛార్జీలు త‌గ్గిస్తానంటూ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లకు సంబంధించిన వీడియోల‌ను టీడీపీ నేత‌లు సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున పోస్టు చేస్తున్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News