వన్నియార్ కులస్తులకు రిజర్వేషన్లు చెల్లవు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- వన్నియర్లకు ఎంబీసీలో 10.5 శాతం రిజర్వేషన్లను కల్పించిన స్టాలిన్ ప్రభుత్వం
- రిజర్వేషన్లు చెల్లవంటూ గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు
- మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
వన్నియర్ కులానికి స్టాలిన్ ప్రభుత్వం 10.5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ 2021లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఎంబీసీ కోసం 20 శాతం కోటా ఉండగా... అందులో 10.5 శాతాన్ని వన్నియర్ కులానికి వర్తింపజేస్తూ తమిళనాడు యాక్ట్ 2021ని తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో హైకోర్టు తీర్పును స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లు చెల్లవంటూ తీర్పును వెలువరించింది.