ప్రభాస్ సర్జరీ తరువాతనే 'సలార్'

Salaar movie update
  • ప్రభాస్ తాజా చిత్రంగా 'సలార్'
  • ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ 
  • కోల్ మాఫియా నేపథ్యంలో సాగే కథ 
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఇంతవరకూ  50 శాతానికి లోపే చిత్రీకరణను జరుపుకుంది. కోల్ మాఫియా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. 'రాధే శ్యామ్' సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ బిజీగా ఉండటం వలన, ఈ సినిమా షూటింగును ఆపడం జరిగిందని అనుకున్నారు.

ఇక 'రాధే శ్యామ్' హడావిడి తగ్గింది కనుక, 'సలార్' తదుపరి షెడ్యూల్ మొదలవుతుందని భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ సర్జరీ విషయం తెరపైకి వచ్చింది. విదేశాల్లో ప్రభాస్ సర్జరీ జరగనుందని అంటున్నారు. ఈ సర్జరీ తరువాత ప్రభాస్ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారట. ఆ తరువాతనే తిరిగి ఆయన 'సలార్' షూటింగులో పాల్గొంటాడని చెబుతున్నారు.

ఈ కారణంగానే ప్రస్తుతానికి 'సలార్' షూటింగును ఆపేయడం జరిగిందని అంటున్నారు. శ్రుతి హాసన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా కనిపించనుంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న 'ప్రాజెక్టు K' కూడా సెట్స్  పై ఉన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Prabhas
Sruthi Haasan
Salaar Movie

More Telugu News