పద్మావతి నిలయంలో బాలాజి జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- తిరుపతి కేంద్రంగా బాలాజి జిల్లా
- టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి నిలయంలో కలెక్టరేట్‌కు ఏర్పాట్లు
- నిలుపుదల చేసిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్
- సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేసిన డివిజన్ బెంచ్
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై గురువారం నాడు విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేసింది. అంతేకాకుండా కలెక్టరేట్ కోసం పద్మావతి నిలయంలో మార్పుల కోసం కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేసిన సింగిల్ జడ్జి ఆదేశాలను కూడా డివిజన్ బెంచ్ రద్దు చేసింది. వెరసి పద్మావతి నిలయంలోనే బాలాజి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు కానుంది.