అప్పుడే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి 'రాధేశ్యామ్'?
- ఈ నెల 11వ తేదీన వచ్చిన 'రాధేశ్యామ్'
- 3 రోజుల్లో 151 కోట్ల గ్రాస్
- అమెజాన్ ప్రైమ్ కి స్ట్రీమింగ్ హక్కులు
- ఏప్రిల్ 2వ తేదీన ఓటీటీ రిలీజ్ అనే టాక్
ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు చాలామందే ఉన్నారు. సాధారణంగా థియేటర్లకు వచ్చిన ఒక నెల తరువాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి సినిమాలు అడుగుపెడుతుంటాయి. అలా చూసుకుంటే ఏప్రిల్ 11 తరువాత ఈ సినిమా ఓటీటీకి రావలసి ఉంటుంది.
కానీ ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీనే ఓటీటీ ద్వారా వదలాలనే ఆలోచనలో అమెజాన్ ప్రైమ్ వారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను వారే సొంతం చేసుకున్నారు. 'ఉగాది' కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో వారు చర్చలు జరుపుతున్నారట. ఆ చర్చలు ఫలిస్తే మాత్రమే ఈ సినిమా ఏప్రిల్ 2న రావడం ఖాయమేనని అంటున్నారు.