జగన్‌తో ఎస్ఎస్ రాజమౌళి భేటీ.. ఏమేం చర్చించారంటే..!
- జగన్‌తో భేటీ కోసం బెజవాడకు రాజమౌళి
- అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆలస్యంగా భేటీ
- జగన్, పేర్ని నానిలతో రాజమౌళి, దానయ్య చర్చలు
- ఆర్ఆర్ఆర్ సినిమా చుట్టూనే చర్చ
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో సీఎం జగన్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిలతో రాజమౌళి, దానయ్య భేటీ అయ్యారు. త్వరలో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు, బెనిఫిట్ షో తదితర అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.