జనసేన పార్టీ ఆవిర్భావ సభ వ‌ద్ద ఎమ్మెల్యే రాపాకపై ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్.. ఫొటో వైర‌ల్

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోన్న నేప‌థ్యంలో అక్క‌డ ఓ అమితాస‌క్తిక‌ర పోస్ట‌ర్ వెలిసింది. అందులో జ‌న‌సేన అసంతృప్త ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఫొటో ఉంది. ఈ స‌భ‌లోకి ఆయనకు ప్ర‌వేశం లేద‌ని అందులో తెలియజేస్తూ... 'ఇట్లు మీ ప‌ల్ల‌కి మోసిన రాజోలు జ‌న‌సైనికులు' అని పేర్కొన్నారు. 

కాగా, జ‌న‌సేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వ‌ర ప్ర‌సాద్ అనంత‌రం ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీకి మద్దతుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు వ్యతిరేకంగా జనసేన కార్య‌క‌ర్త‌లు ఈ పోస్ట‌ర్ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


More Telugu News