ఐసీసీ టాప్ ర్యాంకులో జడేజా
- టెస్టుల్లో ఆల్ రౌండర్‌గా టాప్‌లో జడేజా
- బ్యాటింగ్ లో కోహ్లీకి 5, రోహిత్‌కు 6 వ ర్యాంకులు
- బౌలింగ్‌లో రెండో స్థానంలో అశ్విన్
బ్యాటింగ్‌లో తనదైన శైలి సత్తా చాటిన జడేజా 54వ ర్యాంకు నుంచి ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంకులోకి చేరాడు. బౌలింగ్ లో 17వ ర్యాంకుకు ఎగబాకాడు. ఇక ఈ ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ 5వ ర్యాంకులో, కెప్టెన్ రోహిత్ శర్మ 6, వికెట్ కీపర్ 10వ ర్యాంకులో నిలిచారు. బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంకులో, జస్ ప్రీత్ బుమ్రా పదో ర్యాంకులో కొనసాగుతున్నారు.