ర‌ష్యాతో దోస్తానా నేపథ్యంలో... బెలార‌స్‌పై ఈయూ ఆంక్ష‌ల క‌త్తి

European Union sanctions on Belarus
  • ర‌ష్యాకు మ‌ద్ద‌తుగా నిలిచిన బెలార‌స్‌
  • బెలార‌స్‌పై ఆంక్ష‌ల‌కు ఈయూ ఆమోదం
  • ఉక్రెయిన్‌, ర‌ష్యా దేశాల చ‌ర్చ‌ల‌కు వేదిక‌గా బెలార‌స్‌
ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవాల‌న్న క‌సితో ఏకంగా యుద్ధానికే తెర తీసిన ర‌ష్యా వైఖ‌రిని యావ‌త్తు ప్ర‌పంచం విమ‌ర్శిస్తోంది. ర‌ష్యాతో బ‌ల‌మైన మైత్రి క‌లిగిన భార‌త్ లాంటి దేశం కూడా యుద్ధం మొద‌లెట్టిన ర‌ష్యాకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు. అయితే యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు వేదిక‌ను సిద్ధం చేసిన చిన్న దేశం బెలార‌స్ మాత్రం ర‌ష్యా వైఖ‌రికి మ‌ద్ద‌తు ప‌లక‌డంతో పాటుగా ఏకంగా ర‌ష్యాతో క‌లిసి యుద్ధ రంగంలోకి దిగేందుకు కూడా సిద్ధ‌మైపోయింది. ఈ ఫ‌లితంగా ఆ దేశంపై ఆంక్ష‌లకు తెరలేచింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సహాయక పాత్ర పోషించిన కారణంగా బెలారస్‌పై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఆంక్షల ఆమోదానికి ఈయూ దౌత్యవేత్తలు అంగీకరించినట్టు ఫ్రెంచ్‌ ప్రెసెడెన్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆంక్ష‌ల్లో భాగంగా బెలారస్‌పై కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలతో పాటుగా కలప, ఉక్కు, పోటాషియంపై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా సైతం బెలారస్‌లో తమ రాయబార కార్యాలయం కార్యకలాపాలను సస్పెండ్‌ చేసింది.
Go Back to Shorts
Ukraine
Russia
belarus
european union

More Telugu News