ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానమైన ‘మ్రియా’ను ధ్వంసం చేసిన రష్యా
- హోస్టామెల్ ఎయిర్పోర్టుపై రష్యా దాడి
- విమానం ధ్వంసమైనట్టు పేర్కొన్న ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి
- వారు ధ్వంసం చేసింది విమానాన్నే కానీ తమ కలను కాదన్న ఉక్రెయిన్
‘మ్రియా’ను ధ్వంసం చేయడంపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. దీనిని తాము పునర్నిస్తామని స్పష్టం చేసింది. బలమైన, స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కలను నెరవేరుస్తామని అధికార ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. రష్యా ధ్వంసం చేసింది విమానాన్నే కానీ తమ మ్రియా ఎప్పటికీ నశించదని పేర్కొంటూ విమానం ఫొటోను షేర్ చేసింది.