వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు పులివెందుల నుంచి కడప కోర్టుకు బదిలీ

YS Viveka murder case shifted to Kadapa court
  • కడప సీబీఐ ట్రైబ్యునల్ కు కేసు బదిలీ
  • కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ అధికారులు
  • అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాని శివశంకర్ రెడ్డి
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును పులివెందుల కోర్టు నుంచి కడప సీబీఐ ట్రైబ్యునల్ కు బదిలీ చేశారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసింది. కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు ఈరోజు పులివెందుల కోర్టులో ప్రవేశపెట్టారు.

అనారోగ్య కారణాలతో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
YS Vivekananda Reddy
Murder Case
Kadapa Court

More Telugu News