గౌత‌మ్‌రెడ్డి స్నేహపూర్వకంగా మెలిగేవారన్న‌ బాల‌కృష్ణ.. ఇంటిల్లిపాది దిగ్భ్రాంతికి గురయ్యామ‌న్న మోహన్ బాబు

balakrishna expresses condolences
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. గౌతమ్‌రెడ్డి ఇక లేరన్న మాట వినడానికే బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయ‌న హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరితోనూ ఆయ‌న‌ స్నేహపూర్వకంగా మెలిగేవారని బాల‌కృష్ణ అన్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేసేవారని, ఆయన సేవలు చిరస్మరణీయమ‌ని చెప్పారు.

గౌతమ్‌రెడ్డి మృతితో త‌మ‌ ఇంటిల్లిపాది దిగ్భ్రాంతికి గురయ్యామ‌ని సినీన‌టుడు మోహన్ బాబు అన్నారు. గౌతమ్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.
Go Back to Shorts
Balakrishna
Mohan Babu
Mekapati Goutham Reddy

More Telugu News