బాలయ్యతో చేసే సినిమా ఓ సంచలనమే అవుతుంది: అనిల్ రావిపూడి

Balakrishna  upcoming movies update
  • దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి క్రేజ్
  • ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాతో బిజీ
  • తరువాత సినిమా బాలయ్యతో
  • త్వరలోనే స్క్రిప్ట్ పై కసరత్తు
బాలకృష్ణ 100వ సినిమా చేయాలనుకుంటున్న సమయంలోనే అనిల్ రావిపూడి ఆయనకి ఒక కథను వినిపించడం జరిగింది. అయితే 100 సినిమా చారిత్రక చిత్రం అయితే బాగుంటుందని భావించిన బాలకృష్ణ ఆ వైపు మొగ్గు చూపారు. ఆ తరువాత ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీ అయ్యారు. ఇటీవల బాలకృష్ణ 'అఖండ'తో అనూహ్యమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.    


ప్రస్తుతం బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు., ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. గోపీచంద్ మలినేని సినిమా తరువాత ప్రాజెక్టు అనిల్ రావిపూడితో ఉంటుందని బాలకృష్ణ ధృవీకరించారు కూడా.

తాజాగా ఈ సినిమాను గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. " ఇంతవరకూ బాలకృష్ణగారు చేసిన సినిమాలకి భిన్నంగా నా సినిమాలో కనిపిస్తారు. త్వరలోనే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు మొదలెడతాను. బాలకృష్ణగారితో నేను చేసే ఈ సినిమా సంచలనాన్ని సృష్టించడం ఖాయం" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Balakrishna
Gopichand Malineni
Anil Ravipoodi

More Telugu News