Team India: చివరి టీ20లో టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన వెస్టిండీస్

West Indies won the toss and elected bowling
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో నేడు చివరి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్ ను చేజిక్కించుకోగా, ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ పోరులో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ 14 బంతుల్లో 4 ఫోర్లతో 17 పరుగులు చేశాడు. అతడికి జతగా శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నాడు. అయ్యర్ 3 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేశాడు. అంతకుముందు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
Go Back to Shorts
Team India
West Indies
T20
Toss
Eden Gardens
Kolkata

More Telugu News