బడా ఇన్వెస్టర్లకు ‘పేటీఎం’ కష్టాలు !

16-02-2022 Wed 12:36 | Business
  • బఫెట్ కంపెనీకి 2.41 శాతం వాటా
  • ఒక్కో షేరుకు రూ.1280
  • ప్రస్తుత ధర రూ.870
  • ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకూ భారీ నష్టాలు
  • ఐపీవో ధర రూ.2,150
పేటీఎం పేరుతో డిజిటల్ చెల్లింపులు, స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, రుణ సేవలను అందిస్తున్న వన్ 97 కమ్యూనికేషన్స్ షేరు వాటాదారులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. వారెన్ బఫెట్ సహా బడా ఇన్వెస్టర్ల నుంచి చిన్న ఇన్వెస్టర్ల వరకు ఈ షేరులో అధిక ధర వద్ద చిక్కుకుపోయి లబోదిబో మనే పరిస్థితిలో ఉన్నారు.

మంగళవారం ఈ షేరు రూ.840 వద్ద ఉంటే, బుధవారం రూ.870 సమీపంలో ట్రేడ్ అవుతోంది. మూడు నెలల క్రితమే పేటీఎం ఐపీవో ముగిసింది. ఒక్కో షేరును రూ.2,150 ధరపై కంపెనీ జారీ చేసింది. ఆ ధరతో పోలిస్తే 60 శాతం మేర ఇన్వెస్టర్ల పెట్టుబడి హరించుకుపోయింది.

అమెరికాకు చెందిన సుప్రసిద్ధ బడా ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ షేర్ హాతవే ఇంటర్నేషనల్ హోల్డింగ్స్.. 2018 సెప్టెంబర్ లో పేటీఎంలో పెట్టుబడులు పెట్టింది. సుమారు రూ.2,179 కోట్లతో 2.6 శాతం వాటా తీసుకుంది. ఒక్కో షేరుకు చెల్లించిన సగటు ధర రూ.1,280గా ఉంది. 2021 డిసెంబర్ నాటికి కంపెనీలో 2.41 శాతం వాటా బెర్క్ షైర్ హాతవేకు ఉంది.

తాజా ధర ప్రకారం చూస్తే బఫెట్ కంపెనీ 35 శాతం నష్టపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు యాంట్ ఫిన్ హోల్డింగ్స్ బీవీ, ఎస్ వీఎఫ్ పాంథర్ రూ.1,835 చొప్పున వన్97 కమ్యూనికేషన్స్ షేరును కొనుగోలు చేశాయి. ఇప్పటికి 55 శాతం పెట్టుబడిని నష్టపోయాయి. ఈ ఇన్వెస్టర్లు పేటీఎంలో లాభాలు చూడాలంటే దీర్ఘకాలంపాటు కొనసాగక తప్పేలా లేదు. పలు బ్రోకరేజీ సంస్థలు పేటీఎం షేరు పట్ల సానుకూలంగానే ఉన్నాయి. రూ.1,460 నుంచి రూ.2,530 మధ్య టార్గెట్ లను ఇచ్చాయి.
Warren BuffettPaytminstitutional investorsloses

More Telugu News

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52
..more