తెలంగాణలో కొత్తగా 429 కరోనా కేసులు
- గత 24 గంటల్లో 32,932 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 142 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 11,681 మందికి చికిత్స
అదే సమయంలో 2,421 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,83,448 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,67,660 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 11,681 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,107కి పెరిగింది.
