శర్వానంద్ టీజర్ దూకుడు మామూలుగా లేదే!

Adallu Meeku Joharlu movie update
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 
  • శర్వానంద్ జోడీగా రష్మిక
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్
  • ఈ నెల 25వ తేదీన విడుదల
శర్వానంద్ - రష్మిక జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నిన్న టీజర్ ను రిలీజ్ చేశారు.

శర్వానంద్ పాత్ర స్వరూప స్వభావాలతో పాటు కథ ఏమిటనేది టీజర్ తోనే చెప్పేశారు. శర్వానంద్ .. వెన్నెల కిశోర్ మధ్య కామెడీ ఒక రేంజ్ లో ఉంటుందని అర్థమవుతోంది. ఇక రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి పాత్రలు చేసే సందడి కూడా మామూలుగా ఉండదని తెలుస్తోంది. చాలా తక్కువ సమయంలో వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ తో టీజర్ దూకుడు చూస్తుంటే, ఆడియన్స్ ఆసక్తితో ఉన్నారనే అనిపిస్తోంది.  

శర్వానంద్ కి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మద్దతు ఉంది. ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్ కి అవసరమైన అన్ని  అంశాలు కలిసినదే. అందువలన ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ తెచ్చిపెడుతుందని శర్వానంద్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి..
Go Back to Shorts
Sharwanand
Rashmika Mandanna
Kishore Thirumala Movie

More Telugu News