'వాల్తేరు మొనగాడు'గా మెగాస్టార్?
- రిలీజ్ కి రెడీగా 'ఆచార్య'
- ముగింపు దశలో 'గాడ్ ఫాదర్'
- సెట్స్ పైనే ఉన్న 'భోళా శంకర్'
- టైటిల్ పై బాబీ కసరత్తు
ఈ సినిమా తరువాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి 'భోళా శంకర్' సినిమాను లైన్లో పెట్టారు. తమన్నా కథానాయికగా ఈ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేసింది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి బాణీలు కడుతున్నాడు. ఇక ఆ తరువాత సినిమాను బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నారు.
ఈ సినిమాకి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచారు. ఈ టైటిల్ అయితే పాత్రను పరిచయం చేస్తున్నట్టుగా ఉందనీ, ఆ పాత్ర హీరోయిజం టైటిల్ లో కనిపిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. ఆ ప్రయత్నంలో భాగంగానే 'వాల్తేరు మొనగాడు' అయితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. ఫైనల్ గా ఏది ఖరారు చేస్తారనేది చూడాలి.