Appala Raju: ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు విశాఖ శారదాపీఠం వద్ద అవమానం

YSRCP minister Appala Raju insulted by CI
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు ఘోర అవమానం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు విశాఖ శారదాపీఠానికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఒక్కరే లోపలకు వెళ్లాలని, అనుచరులను లోపలకు పంపించబోమని ఒక సీఐ స్పష్టం చేశారు.

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా... మీరు ఒక్కరే వెళ్తే వెళ్లండి లేకపోతే లేదు అంటూ ఆయన ముఖం మీదే గేటు వేశారు. దీంతో షాక్ కు గురైన మంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. అంతే కాదు మంత్రి అని కూడా చూడకుండా సీఐ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Appala Raju
Visakha Sharada Peetam
YSRCP

More Telugu News