'శ్రీవల్లి' పాటను అద్భుతంగా ఆలపించిన నెదర్లాండ్స్ గాయని... వీడియో చూసి ఫిదా అయిన దేవీ శ్రీప్రసాద్
- 'పుష్ప' చిత్రంలో సూపర్ హిట్టయిన 'శ్రీవల్లి' సాంగ్
- దేశాల సరిహద్దులు దాటి అలరిస్తున్న గీతం
- ఇంగ్లీషు, తెలుగులో పాడిన ఎమ్మా హీస్టర్స్
- వీడియో పంచుకున్న దేవి శ్రీప్రసాద్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పుష్ప సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ దృష్టికి వచ్చింది. ఆయన ఈ వీడియో చూసి ముగ్ధుడయ్యారు. "హేయ్ సిద్ శ్రీరామ్ బ్రో... ఈ పాట రికార్డు చేస్తున్నప్పుడు శ్రీవల్లి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చేయాలని మనం అనుకున్నాం కదా... అయితే ఈ పాటకు అద్భుతమైన కవర్ సాంగ్ వచ్చింది... ఇదిగో!" అంటూ ఎమ్మా హీస్టర్స్ పాడిన పాట తాలూకు వీడియోను కూడా పంచుకున్నారు.