తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!

Telangana corona report
  • గత 24 గంటల్లో 48,434 కరోనా పరీక్షలు
  • 1,217 మందికి పాజిటివ్
  • గ్రేటర్ హైదరాబాదులో 383 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 26,498 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో 48,434 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 383 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 99 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 3,944 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,77,530 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,46,932 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 26,498 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,100కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Daily Report
Today Cases

More Telugu News