తెలంగాణలో మరో 3,603 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 93,397 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,421 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 32,094 మందికి చికిత్స
అదే సమయంలో 2,707 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,34,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,98,649 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 32,094 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,072కి పెరిగింది.
