'అటువంటి వ్యాఖ్యలు సరికాదు'.. వర్ల రామయ్యకు ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరిక
- పోలీసు అధికారులను ఏకవచనంతో సంబోధిస్తున్నారు
- అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటి?
- సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు
- వ్యక్తిగతంగా దూషించడం సరికాదు
ప్రతిపక్ష నేతలుగా ఉన్న వారు ప్రజా సమస్యలపై సర్కారుతో పోరాడాలిగానీ, అధికారులను పదే పదే వివాదాల్లోకి లాగుతూ, వారిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని చెప్పారు. ప్రతి స్థానిక సమస్యను డీజీపీకి ఆపాదించకూడదని పేర్కొన్నారు. మాట్లాడుతోన్న సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని సూచించారు. మళ్లీ ఇదే విధంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేశారు.