నెట్ ఫ్లిక్స్ లో 'శ్యామ్ సింగ రాయ్'

Shyam Singha Roy movie update
  • క్రితం నెల 24న వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
  • ఓవర్సీస్ లోను మంచి రికార్డు
  • ఈ నెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో    
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమా క్రితం నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. 70వ దశకం ప్రధానంగా నడిచే ఈ కథలో నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా అలరించారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. క్రితం ఏడాది నాని నుంచి థియేటర్లకు వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం నానీకి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇటు నానీకి .. అటు సాయిపల్లవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు ఉంది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నాని తదుపరి సినిమాగా 'అంటే .. సుందరానికీ' సెట్స్ పై ఉండగా, సాయిపల్లవి 'విరాటపర్వం' రిలీజ్ కి రెడీగా ఉంది.
Go Back to Shorts
Nani
Sai Pallavi
Krithi Shetty
Shyam Singha Roy Movie

More Telugu News