బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
- జాగరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
- కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ సంజయ్ అరెస్ట్
- 14 రోజుల రిమాండ్ విధించిన కరీంనగర్ కోర్టు
- బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్
- తనకు రోస్టర్ లేదన్న హైకోర్టు
అటు, బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఈ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అయితే నార్త్ జోన్ డీసీపీ దీనిపై స్పందించారు. నడ్డా ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని తెలిపారు.