ఏపీలో మరో 122 మందికి కొవిడ్ పాజిటివ్
- గత 24 గంటల్లో 15,568 కరోనా పరీక్షలు
- విశాఖ జిల్లాలో 41 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 1,278 మందికి చికిత్స
అదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,832 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,278 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,498కి పెరిగింది.