'అంటే .. సుందరానికీ' నుంచి జీరోత్ లుక్!
- వినోదమే ప్రధానంగా 'అంటే సుందరానికీ'
- నాని సరసన నాయికగా నజ్రియా
- సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్
- జనవరి 1వ తేదీన ఫస్టులుక్
న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి జనవరి 1వ తేదీ 4:05 నిమిషాలకు జీరోత్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. కె పి వి ఎస్ ఎస్ పి ఆర్ సుందర ప్రసాద్ పాత్రను పరిచయం చేయనున్నట్టుగా చెప్పారు. అంటే మన కథానాయకుడు సుందరానికి ఇది అసలుపేరు అనుకోవాలి.
అంతా బాగానే ఉందిగానీ మరి జీరోత్ లుక్ అంటూ ఈ కొత్త ప్రయోగం .. కొంత సస్పెన్స్ వెనుక క్రియేటివిటీ ఏమిటనేదే చూడాలి. సినిమాలో నాని జోడీగా నజ్రియా నజీమ్ కనువిందు చేయనుంది. ఈ మలయాళ బ్యూటీ తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే. వివేక్ సాగర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అని చెబుతున్నారు.