Srinivasananda Saraswathi: వైయస్సార్సీపీ అంటే... వైయస్సార్ క్రిస్టియన్ పార్టీ.. హిందువులను అణచివేస్తోంది: శ్రీనివాసానంద సరస్వతి

YSRCP means YSR Christian Party says Srinivasananda Saraswathi
  • హిందూ సమాజాన్ని వైసీపీ ప్రభుత్వం అవమానిస్తోంది
  • రామతీర్థం నిందితులను ఇంతవరకు పట్టుకోలేదు
  • పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసింది
ఏపీలో హిందువులను అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఒక రహస్య అజెండాతో ముందుకు సాగుతోందని సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజాన్ని వైసీపీ ప్రభుత్వం దారుణంగా అవమానిస్తోందని మండిపడ్డారు. రామతీర్థం రామాలయంలో దారుణ ఘటన జరిగి ఏడాది పూర్తయినా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని అన్నారు. హిందువులపై వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతకు ఇదే నిదర్శనమని చెప్పారు. వైయస్సార్సీపీ అంటే వైయస్సార్ క్రిస్టియన్ పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. పోలీస్ వ్యవస్థను సైతం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
Srinivasananda Saraswathi
Sahdu Parishath
YSRCP
YSR Christian Party

More Telugu News