తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టుల మృతి
- ఈ ఉదయం 6-7.30 గంటల ప్రాంతంలో ఘటన
- మృతి చెందిన మావోల్లో నలుగురు మహిళా నక్సలైట్లు
- చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు కూడా మృతి
చర్ల మండలానికి 25 కిలోమీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 6-7.30 గంటల మధ్య ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. మృతి చెందిన మావోయిస్టుల్లో నలుగురు మహిళా నక్సల్స్‌తోపాటు చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు కూడా మృతి చెందారు. కాగా, ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.