తెలంగాణ కరోనా రోజువారీ కేసుల వివరాలు ఇవిగో!
- రాష్ట్రంలో తాజాగా 35,037 కరోనా పరీక్షలు
- 162 మందికి పాజిటివ్
- జీహెచ్ఎంసీ పరిధిలో 81 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,547 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,413 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 6,72,847 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,547 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,019కి పెరిగింది.
